వేడుకగా అన్నమాచార్య జయంతి

నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో శ్రీ సాయి శృతి మ్యూజిక్ అకాడమీ వసుధ మూర్తి ఆధ్వర్యంలో తాళ్ళపాక అన్నమాచార్య జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించారు.

అన్నమయ్య సంకీర్తనలపై “సంకీర్ర్హణార్చన, నృత్య రూపకల్పన ” వసుధ మూర్తి శిష్య బృందం అన్నమయ్య సంకీర్తనలను, ఆ కీర్తనలకు నృత్యాభినయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 90 మంది కళాకారులు పాల్గొన్నారు. టీవీ నటులు పీవీ ప్రదీప్, టీవీ యాంకర్ సరస్వతి ప్రదీప్, నృత్య కళాకారిణి ఆశ్రిత వేముగంటి, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ జ్యోస్యభట్ల పాల్గొని కళాకారులను అభినందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here