ఘనంగా హోప్ ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం

  • వేడుకగా కేక్ కటింగ్
  • పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బట్టలు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి : సమాజానికి తోచినంత సేవ చేయాలనే ఆలోచనతో హోప్ ఫౌండేషన్ పేరిటా సేవా సంస్థను ప్రారంభించామని ఆ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు. హోప్ ఫౌండేషన్ ప్రారంభించి 9 వార్షికోత్సవంలోకి అడుగిడుతున్న సందర్భంగా మాదాపూర్ వార్డు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల మధ్య కేక్ కట్ చేసి, వారికి చీరలు , బట్టలు పంపిణీ చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో 2016 సంవత్సరంలో సంస్థను ఏర్పాటు చేసి నిరంతరం సేవను కొనసాగిస్తున్నామని చెప్పారు.

మాదాపూర్ వార్డు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు , బట్టలు పంపిణీ చేస్తున్న హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ 

తమ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు, పేద విద్యార్థులకు, వైద్య సమస్యలు ఉన్న పేద వారికి సహాయం చేస్తున్నట్లు తెలిపారు. విద్యా రంగంలో రాణిస్తున్న విద్యార్థులకు చేయూత, పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు తదితర సేవా కార్యక్రమాలు నిత్యం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.


ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతోపాటు లయన్స్, హోప్ సభ్యులు బసిరెడ్డి మధుసూధన్ రెడ్డి, బర్క మల్లేశ్ యాదవ్, రాజశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here