- ఇండ్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గాంధీకి వినతి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ లో ఇండ్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడారు.
ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా సరైన న్యాయం చేస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్థానాని, అధైర్య పడకూడదని, అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇదివరకు ఇండ్లు పొందిన వారి లాగే మిగతా వారికి కూడా ఇండ్లు వచ్చేలా చూస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్తామని, అర్హులైన ప్రతి లబ్ధిదారులకు గృహ నిర్మాణ పథకాలలో వెంటనే లబ్ది చేకూర్చేలా ఆదుకుంటామని, అదేవిధంగా వారికి గృహ నిర్మాణం పథకాలలో కేటాయించేంత వరకు వారికి తాత్కాలికంగా వసతి, ఇతర సదుపాయాలు కలిపించి వారికి సరైన న్యాయం చేకూర్చేలా చేస్తానని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సీనియర్ నాయకులు ముళగిరి శ్రీనివాస్, ప్రభాకర్, రమేష్, రంగస్వామి, సురేష్, రాజు, సత్య శ్రీశైలం, బసవతారక నగర్ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.