వార్డ్ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • మాదాపూర్ డివిజన్ వార్డ్ కార్యలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని కాకతీయ హిల్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయాన్ని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వార్డ్ కార్యాలయంలో జరుగుతున్న పనితీరును పరిశీలిం చి, రికార్డులను తనిఖీ చేశారు. ప్రజల నుండి వచ్చిన వినతులను కంప్యూటరికరించే విధానం, వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు చేరవేస్తున్నార అని సంబంధిత అధికారులను వాకబు చేశారు. అదేవిధంగా వార్డ్ కార్యాలయాలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక చక్కటి వేదిక అని, ప్రజల చెంతకు పాలన అని తెలిపారు. ఈ సదవకాశంను ప్రతి ఒక్కరు , కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వార్డ్ కార్యాలయంలో ఆయా శాఖలలో అందుబాటులో ఉండే అధికారులు

1. పరిపాలన – వార్డు పరిపాలన అధికారి

2. ఇంజినీరింగ్ – వార్డు ఇంజినీరు

3. టౌన్ ప్లానింగ్ (పట్టం ప్రణాలిక ) – వార్డు టౌన్ ప్లానర్

4. ఎంటమాలజీ – వార్డు టౌన్ ప్లానర్ – వార్డు ఎంటమాలజిస్టు

5. పారిశుద్ధ్యం – వార్డు పారిశుద్ధ్య జవాను – వార్డు పారిశుద్ధ్య జవాను

6. పట్టణ సామాజిక అభివృద్ధి విభాగము – వార్డు కమ్యూనిటీ ఆర్గనైజర్

7. పట్టణ జీవ వైవిధ్యం –వార్డు యుబిడి సూపర్వైజర్

8. హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బోర్డు (జలమండలి) – వార్డు సహాయకుడు

9. తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ సరఫరా కంపనీ లిమిటెడ్ – లైన్మెన్ / లైన్ ఇన్స్ పెక్టర్

10. ఫిర్యాదుల నమోదు – కంప్యూటర్ ఆపరేటర్

పైన పేర్కొన్న అంశాలు, ఇతర విభాగాల అధికారులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, పరిపాలన అందిస్తారని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్,ప్రసాద్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, చిన్న మధుసూదన్ రెడ్డి, సాయి ,హరి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here