జోహార్ సిరిపురం యాదయ్య

  • జోహార్ సిరిపురం యాదయ్య
  • శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిపురం యాదయ్య వర్ధంతి
  • నివాళులర్పించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిపురం యాదయ్య వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నివాళులర్పించారు.  టీపీసీసీ చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్  అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిపురం యాదయ్య చిత్ర పటానికి నివాళులు అర్పి స్తున్న జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ మలిదశ ఉధ్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలను టీవీలో చూసి చలించిపోయి, ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే కృతనిశ్చయంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని జై తెలంగాణ అంటూ నినదిస్తూ పోలీసులపైకి పరుగెత్తిన ధీరుడు సిరిపురం యాదయ్య అని, తానొక అగ్నికణమై తెలంగాణ ఉద్యమ మహాయజ్ఞంలో హవిస్సుగా మారి తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో చెరిగిపోని ముద్ర వేసాడన్నారు.  అలాంటి మహనీయుడి వర్థంతిని ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు పాల్గొని ఘనమైన నివాళులు అర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here