నమస్తే శేరిలింగంపల్లి: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ సహకారంతో “బాలెన్సింగ్ రెస్పాన్సిబిలిటీ: మెడిసిన్, లా, మెడికల్ నెగ్లిజెన్స్” అనే అంశంపై మెడికవర్ హాస్పిటల్ అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి, గౌరవ అతిథిగా తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ హాజరై మాట్లాడారు. న్యాయ నిపుణులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కూడిన ప్యానెల్, వైద్యపరమైన నిర్లక్ష్యం, ఆరోగ్య సంరక్షణ పద్ధతులను నియంత్రించే చట్టపరమైన విధానాలకు సంబంధించి వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు.
వైద్యపరమైన నిర్లక్ష్యం వంటి కేసులలో న్యాయపరమైన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసే న్యాయశాస్త్ర విధానాలను వెల్లడించారు. ఈ పానెల్ లో న్యాయ నిపుణులు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, అశ్విన్ సప్రా, భాగస్వామి (హెడ్- ఫార్మా & హెల్త్‌కేర్), సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్, డాక్టర్ అన్నం శరత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్, ఇండియా తారిఖ్ ఖాన్, రిజిస్ట్రార్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ హైదరాబాద్ ఇషా సిన్హా, చీఫ్ లీగల్ & కంప్లయన్స్ ఆఫీసర్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఎదుర్కొంటున్న నియంత్రణ సవాళ్లు, ముఖ్యంగా డిజిటలైజేషన్, ఇప్పటికే ఉన్న చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఎదురవుతున్న సవాళ్ళను గురించి చర్చించారు. ఆరోగ్య సంరక్షణ సంబంధిత వివాదాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ఆర్బిట్రేషన్‌ను ఒక విలువైన మెకానిజమ్‌గా ఈ సదస్సు దోహదపడింది.