కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి

  • బొటానికల్ గార్డెన్ లో సందర్శకులను కోరిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : సౌమ్యుడు, పేదలకు అండగా నిలబడే కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవికుమార్ యాదవ్ కోరారు. బొటానికల్ గార్డెన్ లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ఓటు వేసి గెలిపించాలని సందర్శకులను కోరారు.

బొటానికల్ గార్డెన్ లో సందర్శకులను కోరుతున్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి, పక్కన శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఇన్ చార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమం, దేశ భద్రత కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు మీకు తెలుసునని, మీ ఓటు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుపై ఓటు వేసి భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించినట్లయితే మనకున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతామని వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు.

కార్యక్రమంలో ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, సంతోష్, శ్రీశైలం యాదవ్, రవి నాయక్, ప్రసాద్, చందు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here