- బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సదస్సులో రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హెచ్చరిక
నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ ఎంఏనగర్ లో బీఎల్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వీనర్ పల్లె మురళి అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ జిల్లా భూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హాజరై మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం రాగానే రూపోందించుకొన్న రాజ్యాంగంలో ఉత్పత్తి సంపద ఫలాలు అన్ని కూడా ప్రతి పౌరుడు కుల మత, బాష, లింగ వివక్షత లేకుండా సమానంగా అనుభవించాలని, శ్రమ ఫలితం శ్రమ జీవులు అనుభవించాలని చెప్పినప్పటి కి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ నేడు నూటికి తొంబై శాతం శ్రమ చేస్తుంటే పది శాతం కూడా లేని పెట్టుబడి దారీ వర్గం సంపద ఉత్పత్తి శక్తులను దోపిడీ చేస్తూ జీవిస్తున్నారన్నారు.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మిగులు భూములు భూ సమస్యగానే మిగిలి ఉంది, మరోపక్క ఇండ్ల స్థలాలు లేక సంవత్సరాల తరబడి ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేద ప్రజల ఇండ్లకు చట్టబద్ధత లేక ప్రభుత్వాలు ఇచ్చే హామీలలో భూ ఇండ్ల పంపిణీ దశాబ్దాలుగా సమస్యగానే మిగిలి ఉంది, నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలించిన బి ఆర్ ఎస్ హామీ హామీ లాగానే మిగిలిపోయిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో భూమి సమస్యపై ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాధగోని రవి, బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులువనం సుధాకర్, కె సుకన్య, మారోజు సునీల్, తుకారాం, ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి, మైదం శెట్టి రమేష్, సహ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తాండ్ర కళావతి, అంగడి పుష్ప, ఇస్లావత్ దశరథ్ నాయక్, పి భాగ్యమ్మ, కర్ర దానయ్య, డి లక్ష్మి, మధు సూదన్, విమల, పార్టీ నాయకులు శివాని, నర్సింహా, లలిత, అనిత సుల్తానా బేగం, అరుణ, ఇషాక్, చందర్, రజియా బేగం, అమీనా బేగం పాల్గొన్నారు.