నమస్తే శేరిలింగంపల్లి : బీసీల రాజ్యాధికారం కోసం ఏకైక మార్గం పోరాటమే చేయడమేనని తెలంగాణ రాష్ట్ర జై బీసీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. ప్రముఖ బీసీ నాయకుడు రాజారామ్ యాదవ్ పిలుపుమేరకు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహం లో పాల్గొని , బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న, వనపర్తి జిల్లా గొర్రెల మేకల సంఘం జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్ కలిసి మాట్లాడారు. ఈ ధర్నాలో బీసీ పోరాటయోధుడు ఆర్ కృష్ణన్న, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, 33 జిల్లాల బిసి ప్రముఖ నాయకులు అధ్యక్ష కార్యదర్శులు అభిమానులు కార్యకర్తలు పెద్దలు ఇందిరాపార్కు వద్ద జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ న్యాయపరమైన విశ్లేషణ చేస్తూ 54 శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్ తప్పక కల్పించాల్సిందేనని, న్యాయపరమైన చిక్కులను తొలగించడానికి మార్గాలు సూచించారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వాగ్దానాల్లో బీసీ కులగననా చేసి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగిందని, ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీల కులాల కులగణన జనాభా ప్రాతిపదికన గణన చేసి జరగబోవు లోకల్ బాడీ ఎలక్షన్లలో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఏకరుపెట్టి రాజ్యాధికారమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇందిరా పార్క్ ధర్నా సత్యాగ్రహంలో నక్క శ్రీనివాస్ యాదవ్ బీసీ నాయకులకు సన్మానించారు. ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల మేకల పెంపకం దారుల మాజీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్, మెదక్ జిల్లా బీసీ నాయకులు దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, సర్వేష్ యాదవ్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అభిమానులు, కార్యకర్తలు పెద్దలు పాల్గొన్నారు.