- ముక్తకంఠంతో నినదించిన దీప్తి శ్రీ నగర్, సీబీఆర్ ఎస్టేట్స్ , కేఎస్ఆర్ ఎనక్లేవ్ కాలనీ వాసులు
- ఎమ్మెల్యే గాంధీకి మంగళ హరతులతో స్వాగతం పలికిన మహిళామణులు
నమస్తే శేరిలింగంపల్లి; చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, సీబీఆర్ ఎస్టేట్స్ , కేఎస్ఆర్ ఎనక్లేవ్ కాలనీల వాసులతో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమ్మేళనానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొవ్వ సత్యనారాయణ, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీనే మళ్ళీ గెలిపిస్తామని దీప్తి శ్రీ నగర్, సీబీఆర్ ఎస్టేట్స్ , కేఎస్ఆర్ ఎనక్లేవ్ కాలనీ వాసులు ముక్తకంఠంతో నినదించారు. రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీ కే ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ రూపు రేఖలు మార్చామని, వరద నుండి విముక్తి కల్పించామని, రాబోయే ఎన్నికల్లో కారుకే మద్దతు తెలుపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.