- బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్
- బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ బూత్ కమిటీ ల సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి; మియాపూర్ లోని నరేన్ గార్డెన్స్ శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ బూత్ కమిటీ ల సమావేశం అత్యంత ఆత్మీయంగా జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు.
- తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆయన మాటల్లో..
- తొమ్మిదనర్ర సంవత్సరాలు కులం మీద కుంపటి, మతాలు మీద మంటలు పెట్టలేదు , ప్రాంతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు సీఎం కేసీఆర్.
- అభివృద్ధి, సంక్షేమం దేశ వ్యాప్తంగా కొత్త పంథాను తీసుకొచ్చాం.
- కేసీఆర్ ని కాదని కులం, మతం పిచ్చోళ్ళని నెత్తికి ఎక్కించుకుందామా?
- 25 రోజులు తరవాత ఎలక్షన్స్ ఉన్నాయి. 9 సంవత్సరాలలో 9వేల కోట్ల రూపాయలతో శేరిలింగంపల్లిని ఎంతో అభివృద్ధి చేశారు ఎమ్మెల్యే గాంధీ.
- శేరిలింగంపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.
- ఒక్క వైపు అభివృద్ధి.. మరో వేపు సంక్షేమం. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సహాయం, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
- ఇంటి ముందే అభివృద్ధి కంటి ముందే అభ్యర్థి ఎప్పుడు పడితే అప్పుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడు గాంధీ.
- 365 రోజులు ప్రజల మధ్యలో ఉండి రాత్రంబవలు కష్టపడే మనసున్న వ్యక్తి, ప్రజల మనిషి గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించాలి.
- దేశంలోనే అత్యంత ఐటి ఉద్యోగాలు కల్పిస్తున్న నియోజవర్గం శేరిలింగంపల్లి అని తెలంగాణ లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములమవుదామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస రావు , ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు , మాజీ కార్పొరేటర్ సాయి బాబా, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , మహిళ నాయకురాలు, అభిమానులు పాల్గొన్నారు.