రాజ్యాంగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమబండ PJR నగర్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా డా. బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని, సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిదని అన్నారు.

ఎల్లమబండ PJR నగర్ లో డా. బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళుర్పిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే అని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఖ్యాతి గడించబోతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణగౌడ్, కాశినాథ్ యాదవ్ ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు కృష్ణారావు, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, బాలస్వామి, యాదగిరి, పుట్టం దేవి, మౌలానా, జగదీష్, రవీందర్, మహేష్, పద్మయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here