నమస్తే శేరిలింగంపల్లి: భవానీ శంకర్ నగర్ కాలనిలో 100 కేవి ట్రాన్స్ ఫార్మర్ ను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించడం జరిగిందని..గతంలో నీరు లేక క్రాప్ హల్ డే, పరిశ్రమలకు పవర్ హల్ డేలు ఉండేవి. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు, పరిశ్రమలకు ఇరవైనాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు వరలక్ష్మి, భవాని శంకర్ నగర్ కాలనీ అధ్యక్షులు రమేష్, అసోషియషన్ సభ్యులు రాజన్న, సివి రమేష్, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.