- ఆల్విన్ కాలనీ డివిజన్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: ఎక్కడికి వెళ్లినా మంగళ హారతులు ఇచ్చి అక్కా చెల్లెలు స్వాగతిస్తున్నారని, వారి దీవెనలతో భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ డివిజన్ లో భవ్యస్ తులశివనం గేటెడ్ కమ్యూనిటీ, నవోదయ కాలనీ, షంషీగూడ, ఇంటింటా ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని, 6 గ్యారంటీల పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారని, ముఖ్యంగా మహిళలకి అన్ని విధాల మేలు జరిగే విధంగా అమ్మ సోనియా గాంధీ. రేవంత్ రెడ్డి పథకాలను నిర్ణయించారని పేర్కొన్నారు.
నవంబర్ 30వ తారీఖున హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరోసారి కోరారు. అవినీతి పాలనను తరిమికొడదాం.. ఇంటి పార్టీ కాంగ్రెస్ ని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.