నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరుతున్నారని చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. చందానగర్ డివిజన్ బిజెపి మహిళామోర్చ అధ్యక్షురాలు శోభా దుబే, యువనాయకులు శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, దేవలతోపాటు రెండు వందల మంది బిజెపి పార్టీ నాయకులు చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డిలు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను చూసి పలు పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం అన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరి బిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడం అభినందనీయమన్నారు.