నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. సత్యం డాన్స్ అకాడమీ గురువు మేళ్లచెరువు కామేశ్వరి శిష్య బృందం చేపట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
నమరామాయణం, పూర్వరంగం, రామాయణ శబ్దం, శ్రీ రామ చంద్ర, భావయామి, నగుమోము, దేహి, దేహి, జగదానందకారకా, మోహన కళ్యాణి తిల్లాన మొదలైన అంశాలను కళాకారులు అక్షిత, కీర్తన, విభా, ఇషితా, కళ్యాణి, శ్రావణి, సౌమ్య, శ్రీయ, సాయి సహస్ర, అనన్య, జస్మితా మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.