నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి రాజనాల శిష్య బృందం చేపట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
భామ ప్రవేశం, రుక్మిణి ప్రవేశం, కొలువైతివరంగశాయి, గణేశా పంచరత్న, అతినిరుపమా, బృందావన నిలయేహ్, నమశ్శివాయతేయ్, ఒకపరికొకపరి, కృష్ణం కలయసఖి, సంగీత సామ్రాజ్య, ఇదిగో భద్రాద్రి మొదలైన అంశాలను శ్రీ మయూరి నృత్యాలయాల కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.