- కమిషనర్ రోనాల్డ్ రాస్ మెమోరాండం సమర్పించిన కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రోనాల్డ్ రోస్ కు మెమోరాండం సమర్పించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కమిషనర్ తో ఆమె సమావేశమయ్యారు. చందానగర్ డివిజన్ లోని శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులను విడుదల చేయాలని, అదేవిధంగా పీజేఆర్ స్టేడియంలో పలు క్రీడలకు కోచ్ లను నియమించాలని పలు క్రీడా ప్రాంగణాలు మరమ్మతులు చేయించాలని కమిషనర్ కు సుచించారు.
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చందానగర్ అమిన్ పూర్ రోడ్డులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, జవహర్ నగర్ కాలనీ, విద్యానగర్, కైలాస్ నగర్ పలు కాలనీలకు చెందిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలంటే అమీన్ పూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. వచ్చే వేసవిలో పీజేఆర్ స్టేడియంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వేసవి క్రిడల్లో క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పీజేఆర్ స్టేడియంను అభివృద్ధి చేయాలన్నారు.