నమస్తే శేరిలింగంపల్లి : వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్ హెచ్ఓ సూచనల ప్రకారం ప్యాట్రోలింగ్ మొబైల్ వాహనంలో ముజ్జాఫర్ అలీ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 2:15 నిమిషాలకు చందానగర్ గంగారాం సమీపంలోని భవాని వైన్స్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు 100 డయల్ కు కాల్ వెళ్లడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
వ్యక్తికి సుమారు 40 నుంచి 45 ఏండ్లు ఉంటాయని, తెల్ల చొక్కా, నల్లప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో ఆ మృతదేహాన్ని 108 అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎం. విట్టల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.