అయ్యప్ప స్వాములకు అన్నదానం.. మహాదానం

  • దీక్షలో ఉన్న 200 మంది స్వాములకు అన్నదానం
  • బిజెపి సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
అయ్యప్ప స్వామికి పూజలు చేస్తున్న బిజెపి సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో మాలధారణ వేసిన అయ్యప్ప స్వాములకు బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎంతో పవిత్రంగా, నియమ, నిష్టలతో అయ్యప్ప మాల ధరించి నిత్యం పూజలు నిర్వహిస్తున్న అయ్యప్ప భక్తులకు ఒక రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అన్నదానం మహాదానమని అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్బంగా అన్నారు.

అయ్యప్ప పూజలో కొబ్బరికాయ కొట్టి పూజ ప్రారంభిస్తున్న అనిల్ కుమార్ యాదవ్

అయ్యప్ప దీక్షలో ఉన్న 200 మంది స్వాములకు అన్నదానం చేసి వారి ఆశీస్సులు పొందారు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసే మహా పుణ్యకార్యాన్ని చేపట్టి స్వామి కృపకు పాత్రులు కావాలని పలువురికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్, బాలు నాయక్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ చారి, పుల్లయ్య నాగేందర్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములకు కావాల్సినవి సమకూరుస్తున్న అనిల్ కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here