- ప్రత్యేక పూజలు చేసిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్ సాయిబాబా దేవాలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా… ఆలయ పూజారులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకం ప్రత్యేక పూజల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ శివుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దినేష్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, భక్తులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.