- చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
- సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి కూకట్ పల్లి కౌండిన్య(గౌడ్ ) సేవా సమితి నివాళి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గౌడ్ వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ప్రారంభించారు. కూకట్‌పల్లి కౌండిన్య(గౌడ్) సేవాసమితి అధ్యక్షుడు గాంధీ సుబ్బారావుగౌడ్, ప్రధాన కార్యదర్శి పాండురంగారావు గౌడ్, కోశాధికారులు మురళీకృష్ణ గౌడ్, ముఖ్య సలహాదారు చక్రపాణి గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. అనంతరం గౌడ కులస్తుల కుల గురువు కౌండిన్య మహర్షి, గౌడ కులస్తుల ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి పూలమాలవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమ్మేళనంలో ఆటల పోటీలో విజయం సాధించిన వారికి, విద్యలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొండ్ల వెంకటేశ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నాగుల్ గౌడ్, జిల్లా అర్బన్ బిజెపి సెక్రటరీ అనిల్ గౌడ్, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు ఏకాంత్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా సెక్రెటరీ విద్యా కల్పన ఏకాంత్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షుడు జగదీష్ గౌడ్, స్వామి గౌడ్ , నరేందర్ గౌడ్, కూకట్ పల్లి సాక్షి దినపత్రిక జోనల్ ఇన్ ఛార్జ్ పరమేష్ గౌడ్, నమస్తే శేరిలింగంపల్లి ఎడిటర్ పుట్ట వినయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.