చేవేళ్లలో 13న నిర్వహించే.. బహిరంగ సభను విజయవంతం చేద్దాం

  • మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్లలో ఏప్రిల్ 13న నిర్వహించే కేసీఆర్ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చేవెళ్ల భారీ బహిరంగ సభ కోసం స్థానిక ఫరా ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ ను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు తెచ్చిన ఘనత బీఆర్ ఎస్ సర్కారుకే దక్కుతుందని పేర్కొన్నారు.

చేవెళ్ల భారీ బహిరంగ సభ కోసం స్థానిక ఫరా ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు

సంక్షేమ పథకాలతో ప్రజలను కేసీఆర్ కాపాడుకుంటే..కాంగ్రెస్ 110 రోజుల పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లేనని తెలిపారు. కాంగ్రెస్ కడగండ్ల పాలనకు చెక్ పడి ప్రజలకు మేలు జరగాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున బహిరంగ సభ తలపెట్టామని, ఈ భారీ బహిరంగ సభ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్లపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని, చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి బాటలు వేసింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here