క్రీడలతో నూతనోత్సాహం: హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్.,

 • ఘనంగా ముగిసిన 5th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2023
పోలీస్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపిఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపిఎస్.,

నమస్తే శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సైబరాబాద్ 5th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2023 ముగింపు /క్లోజింగ్ సెర్మనీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., హాజరయ్యారు. ఈ క్రీడల్లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపిఎస్., ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపిఎస్., బెలూన్లు పావురాలను ఎగరేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆయన వివిధ జోన్ ల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముందుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., గాలిలోకి తుపాకీ కాల్చి పోటీలను ప్రారంభించారు. పురుషుల విభాగంలో రమేశ్ ఎఆర్ పిసి, మహిళల విభాగంలో దీపా WPC గెలుపొందారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., మాట్లాడుతూ… డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., పిలుపు మేరకు సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2023లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్నపోలీసులను అభినందించారు. క్రీడలతో ఫిట్నెస్ ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం/ పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు.

పోటీలను తిలకిస్తూ..

పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. తెలంగాణ పోలీసు సిబ్బంది ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారన్నారు. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి టీఎస్పీసీసీ, పీఎస్ఐఓసీ సెంటర్లను ఏర్పాటు చేసిన సీపీని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., మాట్లాడుతూ.. సైబరాబాద్ లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయడం వరుసగా ఇది 5వ సారి అన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను తట్టి లేపడం తో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ప్రతీ సంవత్సరం జరపాలన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వాన్ని క్రీడలు తోడ్పడతాయన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసులుఇదే స్ఫూర్తిని ప్రొఫెషన్ లోనూ చూపించాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని/ life style ని అవలంబించాలి, సిబ్బంది ఫిట్నెస్ ను కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలి. వీలున్నప్పుడు కుటుంభ సభ్యులతో సమయాన్ని క్వాలిటీ ఆఫ్ టైమ్ గడపాలన్నారు. గత రెండు వారాల నుంచి కష్టపడి ఈ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐపిఎస్., డిసిపి అడ్మిన్ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, సిబ్బందిని సీపీ అభినదించారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపిఎస్., మాట్లాడుతూ… 23, 24 & 25th మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో వివిధ జోన్ల పోలీసు క్రీడాకారులు ఉత్సాహంతో పాల్గొన్నారన్నారు. పోలీసులు నిత్య జీవితంలోనూ వ్యాయామాన్ని భాగం చేసుకోవాలన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ వారి ఆరోగ్యం, మానసికోల్లాసం కోసం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ క్రీడల్లో 9 టీమ్ లు 1)మాదాపూర్ జోన్, 2)బాలానగర్ జోన్, 3)శంషాబాద్ జోన్, 4) రాజేంద్రనగర్ జోన్ 5)మేడ్చల్ జోన్ 6) సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, 7) ట్రాఫిక్ వింగ్ 8) క్రైమ్ వింగ్ 9) మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారన్నారు. పోలీస్ సిబ్బందికి కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర పోటీలు నిర్వహించామన్నారు.
మహిళల విభాగంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ Vs రాజేంద్రనగర్ జోన్ నిర్వహించిన tug of war/టగ్ ఆఫ్ వార్ పోటీల్లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మహిళల పోలీస్ టీమ్ విన్నర్ గా నిలవగా రాజేంద్రనగర్ జోన్ రన్నర్ గా నిలిచారు.
పురుషుల విభాగంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ Vs ట్రాఫిక్ వింగ్ కు నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ విన్నర్ గా నిలవగా ట్రాఫిక్ వింగ్ రన్నర్ గా నిలిచారు.
అనంతరం పోలీస్ అధికారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరినీ ఆకర్షించింది.

 • బాస్కెట్ బాల్..

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వర్సెస్ సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విన్నర్ గా నిలవగా సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ రన్నర్ గా నిలిచారు.

 • ఫుట్ బాల్..

సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ వర్సెస్ సైబరాబాద్ క్రైమ్ వింగ్ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ హోరాహోరీ గా జరిగింది. ఈ మ్యాచ్ లో క్రైమ్ వింగ్ విన్నర్ గా, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ రన్నర్ గా నిలిచారు

 • బ్యాడ్ మింటన్..
 • బ్యాడ్ మింటన్ సింగిల్స్ మెన్స్ లో ఏసిపి వై.మట్టయ్య విన్నర్ గా నిలిచారు. STF ఏసిపి శ్యామ్ బాబు రన్నర్ గా నిలిచారు.
 • బ్యాడ్ మింటన్ డబుల్స్ మెన్స్ లో అడ్మిన్ డిసిపి శ్రీ యోగేశ్ గౌతమ్, ఐపీఎస్., వై.మట్టయ్య ఏసిపి, విన్నర్లు గా నిలిచారు. క్రైమ్స్ ఏడిసిపి నరసింహ రెడ్డి, STF ఏసిపి శ్యామ్ బాబు రన్నర్లు గా నిలిచారు.
  బ్యాడ్ మింటన్ సింగిల్స్ వుమెన్స్ లో విన్నర్ గా సైబర్ క్రైమ్ డిసిపి శ్రీమతి రితిరాజ్, ఐపీఎస్., రన్నర్ గా EOW డిసిపి కవిత నిలిచారు.
 • కబడ్డీ మ్యాచ్..
 • సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వర్సెస్ సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య జరిగిన (మెన్స్) కబడ్డీ మ్యాచ్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విన్నర్ కాగా సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ రన్నర్ గా నిలిచారు.
 • సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ వర్సెస్ మాదాపూర్ జోన్ మధ్య జరిగిన (ఉమెన్స్) కబడ్డీ మ్యాచ్ లో సైబరాబాద్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ విన్నర్ కాగా మాదాపూర్ జోన్ రన్నర్ గా నిలిచారు.
 • వాలీ బాల్..
 • రాజేంద్రనగర్ జోన్ వర్సెస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ మధ్య జరిగిన(మెన్స్) వాలీ బాల్ మ్యాచ్ లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ విన్నర్ కాగా రాజేంద్రనగర్ జోన్ రన్నర్ గా నిలిచారు.

సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ వర్సెస్ మాదాపూర్ జోన్ మధ్య జరిగిన (ఉమెన్స్) వాలీ బాల్ మ్యాచ్ లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ విన్నర్ కాగా మాదాపూర్ జోన్ రన్నర్ గా నిలిచారు.
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, ఐపీఎస్., డిసిపి అడ్మిన్ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., డిసిపి షీ టీమ్స్ దీప్తి పంత్, ఐపీఎస్., డిసిపి ట్రాఫిక్ హర్షవర్ధన్ , ఐపీఎస్., సైబర్ క్రైమ్ డిసిపి రితిరాజ్, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డిసిపిలు మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, బాలనగర్ డిసిపి శ్రీనివాసరావు, ఐపిఎస్., మేడ్చల్ డిసిపి సందీప్, ఏడిసిపి రాజేంద్రనగర్ రష్మి పెరుమాళ్, ఐపిఎస్., సి ఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు కృష్ణ, మట్టయ్య ఇతర సిబ్బంది ఇన్స్పెక్టర్లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here