కార్యకర్తలే పార్టీకి శ్రీరామ రక్ష : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ఆత్మీయ సమ్మేళనం లో ప్రగతి నివేదిక విడుదల

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలోకి చేరేవిదంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలని కార్యకర్తలు, నాయకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. చందానగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్స్ లో నిర్వహించిన చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి , కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, పరిపాలనా విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని, నేడు యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విదంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన ఉందని పేర్కొన్నారు.

క్రిస్టల్ గార్డెన్స్ లో నిర్వహించిన చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి సిపాయిలగా కష్టపడి పని చేయాలని, పని చేసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్/ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షలు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ ప్రగతి నివేదికను ప్రభుత్వ విప్ గాంధీ ప్రవేశపెట్టారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం
చందానగర్ డివిజన్ ప్రగతి నివేదిక
వార్డు నంబర్ 110
 డివిజన్ ఓటర్ల వివరాలు
 స్త్రీలు: 27869
 పురుషులు: 31439
 ఇతరులు: 8
 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 55
 మొత్తం ఓటర్ల సంఖ్య: 59316
 అభివృద్ధి పనుల వివరాలు
202 కోట్ల 51 లక్షల 69 వేల రూపాయల నిధులతో డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు.
జీహెచ్ఎంసీ నిధులు 128 కోట్ల 23 లక్షల 41 వేల రూపాయలతో కాలనీ లలో, బస్తీలలో కల్పించబడిన మౌలిక వసతులు వివరాలు

సమ్మేళనానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు

క్రమ సంఖ్య          వర్గం                    మొత్తం పనులు
                          సంఖ్య                 అంచనా వ్యయం
1 బీటీ రోడ్డు            39                        1519.51
2 సీసీ రోడ్డు            222                       4490.91
3 యూజీడీ             115                      1597.77
4 కమ్యూనిటీ హాల్/ వార్డు కార్యాలయం

నిర్మాణాలు              10                       113.48

5 ఫుట్‌పాత్              2                         69.50
6 బస్ బే                 3                        116.30
7 పార్కు                 5                         225.25
8 డీసిల్టింగ్             32                        491.84
9 కాంపౌండ్ వాల్      13                       231.50
10 స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ)

58                        1265.94
11 ఇతర పనులు     230                       2701.41
మొత్తం                  504                       12823.41
 విధి దీపాల నిర్వహణ:
 విధి దీపాల నిర్వహణకు 1 కోటి 13 లక్షల 86 వేల 4 వందల రూపాయల నిధులతో విధి దీపాల నిర్వహణ
 మిషన్ భగీరథ
 కొత్తగా దాదాపు 5100 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
 డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 13,078 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
 రోజు విడిచి రోజు నలభై అయిదు నిమిషాల నుండి ఒక గంట వరకు నీటి సరఫరా జరుగుతున్నది.
 ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా చేస్తున్నారు.
 రిజర్వాయర్ల నిర్మాణం
 దీప్తి శ్రీ నగర్ లో 11 కోట్ల 91 లక్షల రూపాయలతో 4 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించారు.
 సురక్షా హిల్స్ లో 9 కోట్లతో 3 ML సామర్థ్యం గల రిజర్వాయర్ను నిర్మించారు.
 4.30 కోట్లతో మంచినీటి పైప్ లైన్లు వేశారు.
 హడ్ కో ప్రాజెక్ట్ కింద 6 కోట్లతో దాదాపు 20 కిలోమీటర్లు కొత్త పైపు లైన్లను వేశారు.
 0.4 కోట్లతో మురుగునీటి మార్గాలు ఏర్పాటు చేశారు.
 నాలాల అభివృద్ధి మరియు కల్వర్టుల నిర్మాణం
చందానగర్ డివిజన్ లో 15 కోట్ల 95 లక్షల రూపాయల తో నాలాల అభివృద్ధి , కల్వర్టుల నిర్మాణ పనులు
 దీప్తిశ్రీ నగర్ నుండి గంగారం చెరువు వరకు 2 కోట్ల రూపాయలతో వరద నీటి కాలువను నిర్మాణం
 మదీనగూడ నుండి గంగారం చెరువు వరకు 6 కోట్ల రూపాయలతో వరద నీటి కాలువ నిర్మాణం
 పటేల్ చెరువు నుండి మదీనగూడ వరకు 6 కోట్ల రూపాయలతో వరద నీటి కాలువ నిర్మాణం
 గంగారం చెరువు నుండి పైకి PJR రోడ్డుకు అడ్డంగా 95 లక్షల రూపాయలతో RCC ట్విన్ బాక్స్ కల్వర్ట్ నిర్మాణం.
 శంకర్నగర్ లోని వినాయక దేవాలయం సమీపంలో 1 కోటి రూపాయలతో హైలెవల్ కాజ్వే నిర్మాణం.
 లింక్ రోడ్స్ :
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా ప్రత్యామ్న్యాయ రోడ్ల నిర్మాణం.
 అపర్ణ నుండి NH -65
 శంకర్ నగర్ నుండి MNR స్ట్రీట్ వరకు
 సుందరీకరణ పనులను చేపట్టిన చెరువులు
 మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ లో భాగంగా గంగారాం చెరువు అభివృద్ధి కొరకు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు
 99 లక్షల రూపాయలతో రేగుల కుంట చెరువు అభివృద్ధి
 81 లక్షల రూపాయలతో బక్షికుంట చెరువు అభివృద్ధి
 48 లక్షల రూపాయలతో బచ్చు కుంట చెరువు అభివృద్ధి
 కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ పథకం
 కళ్యాణ లక్ష్మీ – 183
 షాదీ ముబారక్ – 116
మొత్తం 299 మంది లబ్దిదారులకు 1, 73, 30,068 (1 కోటి 73 లక్షల 30 వేల అరవై ఎనిమిది రూపాయలు) అందించారు.
 ఆసరా పింఛన్లు
 వృద్యాప్య పింఛన్లు – 1672
 వితంతువు పింఛన్లు – 1492
 వికలాంగుల పింఛన్లు – 405
 ఒంటరి మహిళా పింఛన్లు – 101
 మొత్తం పింఛన్లు – 3670
 ఆసరా పింఛన్లు (కొత్తగా మంజూరి చేసినవి)
 వృద్యాప్య పింఛన్లు – 942
 వితంతువు పింఛన్లు – 149
 వికలాంగుల పింఛన్లు – 36
 ఒంటరి మహిళా పింఛన్లు – 28
 మొత్తం పింఛన్లు – 1155
 బస్తి దవాఖాన:
 చందానగర్ డివిజన్ లో బస్తి దవాఖాన ఏర్పాటు చేయించి పేదలకు ప్రతి రోజు 160 మందికి పైగా బీపీ, షుగర్ మరియు ఇతర రక్త పరీక్షలు లాంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
 గర్భిణీ స్త్రీలకు 9 నెలలు నిండే వరుకు వారికి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తున్నారు.
 చంటి పిల్లలకు ప్రతి బుధవారం మరియు శనివారం ఉచితంగా cటీకాలు వేస్తున్నారు.
 కంటి వెలుగు :
1. రెండవ విడత కంటి వెలుగు పధకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరుకు 50,850 మంది కంటి పరీక్షలు జరిపి 7200 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణి చేశారు.. వైద్యుల సూచనల మేరకు ఇంకా 3,795 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉంది.
 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF/LOC)
 లబ్ధిదారుల సంఖ్య – 167 (63, 20,079 ) 63 లక్షల 20 వేల డెబ్భై తొమ్మిది రూపాయలు అందించారు.
 దళిత బంధు
 దళిత బంధు పధకం ద్వారా దళిత కుటుంబాలకి ఉపాధి అవకాశాల
కొరకు ఒకొక్కరికి 10 లక్షల చొప్పున పది మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.
 CDP ఫండ్స్ (82 లక్షల 90 వేల రూపాయలు) నిధుల ద్వారా చేపట్టిన పనులు
 తాగు నీరు అందించడానికి రాజేందర్ రెడ్డి నగర్, తార నగర్ కాలనీ లో 22 లక్షల 40 వేల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణ పనులకు నిధులను మంజూరి చేశారు.
 బోర్ బావి ద్వారా నీరు అందించడానికి శంకర్ నగర్, హరిజన బస్తి, శివాజీ నగర్ వీకర్ సెక్షన్, డిఫెన్స్ కాలనీ , అహ్మద్ నగర్ , న్యూ శంకర్ నగర్ లలో 18 లక్షల రూపాయల నిధులను మంజూరి చేశారు.
 కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 30 లక్షల రూపాయల నిధులను మంజూరి చేశారు.
 సీసీ కెమెరాల కోసం 12 లక్షల 50 వేల రూపాయలు మంజూరి చేశారు.
 SDF ఫండ్స్
1. SDF ఫండ్స్ ద్వారా 50 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు
 పార్కుల అభివృద్ధి
 పార్కులు – 22
 చేపట్టవలసినవి పనులు
 శ్రీదేవి థియేటర్ రోడ్ నిర్మించుట కొరకు 5 కోట్ల 86 లక్షల రూపాయల నిధులు మంజూరు
 శ్రీదేవి థియేటర్ రోడ్ లో కల్వర్టుల నిర్మాణానికి 4 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here