- మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు, నాయకులు
- 54వ రోజు రవన్న ప్రజయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: చీకటైతే చాలు పాముల, తేళ్ల భయంతో బెక్కుబెక్కుమని జీవనం సాగిస్తున్న సుభాష్ చంద్రబోస్ కాలనీవాసుల బాధలు తెలుసుకోవడానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాదవ్ స్థానిక నాయకులతో గడప గడపకు తిరిగి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హాయంలోనే మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ ఈ కాలనీ ఏర్పాటుకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన హాయంలో కరెంటు స్తంభాలు, పవర్ బోర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంగన్వాడి సెంటర్, స్థానికంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ కల్పించిన ఘనత బిక్షపతి యాదవ్ కి దక్కుతుందని మరొకసారి గుర్తు చేశారు.
ఈ కాలనీలలో ఉన్న సమస్యలన్నీ మా దృష్టికి వచ్చాయని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయించి ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్, రాఘవేంద్రరావు, నాగుల్ గౌడ్, మాణిక్ రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, గణేష్ ముదిరాజ్, వినోద్ రావు, ఎల్లేష్ రాధాకృష్ణ పాల్గొన్నారు