నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం బి ఆర్ ఎస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ బండి రమేష్ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సిఎం కేసీఆర్ పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సిఎం కేసీఆర్ ముందు చూపు వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 అయిందని, మనల్ని అన్ని రాష్ట్రాల వారు ఆదర్శంగా తీసుకోవడం సీఎం కేసీఆర్ గొప్పతనమని పేర్కొన్నారు.
నగరానికి క్లీన్ అండ్ గ్రీన్ లో ఎన్నో అవార్డులు వచ్చాయని, పారిశుధ్య కార్మికుల శ్రమ ఫలితమే నేడు నగరం సుందరంగా ఉందని కొనియాడారు. వాళ్లకు ఏం చేసినా తక్కువేనన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ఎవరు పోటీ చేసినా కలసి కట్టుగా నిలిచి మరోసారి పార్టీ గెలిచేలా కృషి చేద్దాం అని బండి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ శర్మ, నర్సింగరావు, అరుణ, శ్రీనివాస్, సంగారెడ్డి,శేఖర్ గౌడ్, దేవేందర్, అంజాధ్ అమ్ము, షరీఫ్ పాల్గొన్నారు.