మౌళిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నాం : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ నూతనంగా చేపట్టిన బాక్స్ డ్రైనేజీ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గాంధీ వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురి కాకుండా నాలాల పునరుద్ధరణ పనులు చేపట్టారని తెలిపారు.

అంతేకాక నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, బాక్స్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలో కాలనీలలో మౌళిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు ఇంజనీరింగ్ అధికారులు ఈఈ శ్రీకాంతి గారు డిఇ ఏఈ బిఆర్ఏస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్ గారు అమంజద్ గారు అప్సర్ గారు గీరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here