మౌలిక వసతుల కల్పనే ధ్యేయం: ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అమన్ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు.

అమన్ కాలనీలో సమస్యల. తీరును తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అమన్ కాలనీలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, అమన్ కాలనీలో పలు సమస్యలను పరిశీలించామని, కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్, మహమ్మద్ వజీర్, అమినుద్దీన్, గౌస్, జహంగీర్, రాములు, సుదర్శన్ రెడ్డి, నాసిర్ ఖాన్, మొసిన్, షకీల్ , ఫెరోజ్ అంజమ్మ, సాయమ్మ, సుజాత, యశోదా, భవాని, తులసి, నవనీత, కుమార్ , రామ్‌దేవ్, నూర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here