- ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : ప్రజలను పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. వివేకానందనగర్ డివిజన్, కూకట్ పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వివేకానందనగర్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నిర్వహించిన ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాసాని జ్ఞానేశ్వర్ ని వివేకానంద నగర్, కూకట్పల్లి డివిజన్ల నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపిద్దామని పిలుపునిచ్చారు. వివేకానంద నగర్, కూకట్ పల్లి డివిజన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అభివృద్ది లో మరింత ముందుకు పోదామని, కూత వేటు దూరంలో తన ఇల్లు ఉందని, ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఆత్మీయ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు