నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని, కేసీఆర్ ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. వివేకానంద నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జూపల్లి సత్యనారాయణ, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాధవరం రోజాదేవి రంగారావు, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగారావు, ఆయా డివిజన్ల బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ముక్తకంఠంతో నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు. ఏప్రిల్ 13న చేవెళ్లలో జరిగే కేసీఆర్ భారీ బహిరంగ సభను సమిష్టి కృషితో విజయవంత చేద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నుండి భారీగా తరలివెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, రాజు నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాల హరీష్ రావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, లక్ష్మారెడ్డి, గంగాధర్, భిక్షపతి ముదిరాజు, పోతుల రాజేందర్, వేణు, జిల్లా గణేష్, కాశీనాథ్ యాదవ్, నిమ్మల రామ కృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, చంద్రిక ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.