- బీజేపీ జెండాలను ఎగురవేసిన ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మియాపూర్ బస్ స్టాప్, జనప్రియ నగర్, హఫీజ్ పేట్ గ్రామం చౌరస్తా, ఆల్విన్ కాలనీ కామన్ వద్ద బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు , బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ జెండాలను ఎగురవేశారు.
అనంతరం టిఫిన్ బైటక్ నిర్వహించి, ఓటర్ లిస్ట్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు , బీజేపీ సీనియర్ నాయకులు కోటేశ్వరరావు, బీజేపీ జిల్లా నాయకులు రవి గౌడ్, వరప్రసాద్ , కైతాపురం జితేందర్, బీజేపి డివిజన్ నాయకులు బాబురెడ్డి, జగదీశ్వర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, విజయ్, సుబ్బారావు, కుమార్ , నవీన్ , జగదీష్ , బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొన్నారు.