కాంగ్రెస్ గూటికి దొంతి కార్తిక్ గౌడ్
పార్టీలో చేరిన చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడికి
కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది. ఒక్కొక్కరుగా పలు పార్టీల నుంచి ఆ పార్టీలో చేరుతుండటంతో పటిష్టంగా మారింది. తాజాగా ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్, లింగంపల్లి ముఖ్య నాయకులు దొంతి సత్యనారాయణ గౌడ్, రామచందర్ రెడ్డి, సాయి రెడ్డి, దీపక్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ చారి, ఆనంద్ గౌడ్, సతీష్, మహేష్, శ్రీపాల్ గౌడ్, మహిళ నాయకులు సుధ రాణి, రాధ యూత్ సభ్యులు, యువ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.