బీసీలకు రాజ్యాధికారం వచ్చేవరకు పోరాడుతాం

  • బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: బీసీలకు రాజ్యాధికారం వచ్చేవరకు పోరాడుతామని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కార్యవర్గం, కార్యకర్తలు, శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక కార్యవర్గం, కార్యకర్తలు, శేరిలింగంపల్లి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీసీ ప్రముఖ నాయకుడు, లోకల్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని ఆత్మీయంగా సత్కారం, సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్యమైన బీసీ నాయకులు, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న, శేరిలింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ పాల్గొని జగదీశ్వర్ గౌడ్ నీ ఘనంగా సన్మానించారు. ముందుగా రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నుండి బీసీ ఉద్యమం లేవదీసినందున ఎమ్మెల్యేగా బీసీ నాయకున్ని రాత్రింబవళ్లు కష్టపడి గెలిపించుకుందామని బీసీ సమాజానికి పిలుపునిచ్చారు.

ఆర్కే సాయన్న మాట్లాడుతూ శేరిలింగంపల్లి నుండి స్టార్ట్ అయిన ఉద్యమం ఎన్నికల తర్వాత రాష్ట్రం మొత్తానికి అన్ని జిల్లాలకు మున్సిపల్ మండలాలకు విస్తరిస్తామని, బీసీలకు రాజ్యాధికారం వచ్చేవరకు పోరాడుతామని, అది శేరిలింగంపల్లి నుండి మొదటి అడుగు ప్రారంభమైందని, ముఖ్యంగా మహిళలు, యువజనులు, విద్యార్థి నాయకులు, బీసీ ఉద్యమంలో పాల్గొని యజ్ఞం భావించి ఫలితం పొందుదామని బీసీలకు తెలిపారు. అడ్వకేట్ రమేష్ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యేగా బీసీ నాయకుని గెలిపించుకొని రాష్ట్రవ్యాప్తంగా కార్యవర్గాలు ఏర్పరచుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్య నాయకులు, మహిళలు, యువ నాయకులు కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ నాయకులు ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు తిరుపతి, ప్రధాన కార్యదర్శి సురేందర్ , యాదయ్య, మాదాపూర్ కిట్టు యాదవ్, రాగం దయాకర్ యాదవ్, రామకృష్ణ గౌడ్, నరసింహులు ముదిరాజ్, పి.యాదయ్య, మహిళ అధ్యక్ష కార్యదర్శులు సరోజిని, అమ్మ, వెంకటమ్మ, వీరేశం గౌడ్, విద్యార్థి జేఏసీ చైర్మన్ శ్రీరామ్ యాదవ్, పుల్లయ్య గౌడ్, సత్యం, ఈశ్వరయ్య గౌడ్, నరసింహ యాదవ్, తిరుమలేష్ యాదవ్, రక్తపు జంగం గౌడ్, బీసీ కార్యకర్తలు ప్రముఖులు బీసీ నాయకులు పాల్గొని ఆత్మీయ సమ్మేళనం సన్మాన కార్యక్రమం జయప్రదం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here