ఆవు అంటే ఆనందం, ఆరోగ్యం, ఆదాయం అంటున్న గోమాత సురేష్

  • శేరిలింగంపల్లిలో గో ఆధారిత ఉత్పత్తుల అమ్మకం, శిక్షణ నిర్వహిస్తున్న యువకుడు 

  • వెంకటరెడ్డి కాలనీలో నిత్య ఆరోగ్య యోగ సన్నిధి కేంద్రంగా సేవలు

  • ప్రత్యేక ఆకర్షణగా సాంప్రదాయ మర్మ మసాజ్ థెరపీ

నమస్తే శేరిలింగంపల్లి: సనాతన సంస్కృతిలో గోవుకు విశిష్టమైన స్థానం ఉంది. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా మానవాళికి ఉపయోగపడే గోవును మన పూర్వికులు లక్ష్మీ స్వరూపమైన కామధేనువుగా భావించారు. కాలక్రమంలో వివిధ కారణాల వాళ్ళ గోవుల నిర్వహణ ఆర్థిక భారంగా మారింది. పాలకోసం తప్ప ఇతర గో ఆధారిత ఉత్పత్తుల వినియోగం మన దేశంలో తగ్గిపోయింది. ఫలితంగా వేలాది ఆవులు కబేళాలకు తరలిపోయాయి. తాజాగా గో ఉత్పత్తులపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ప్రజల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆవుల నిర్వహణ ద్వారా అనేకరకాల ఉత్పత్తులను తయారు చేస్తూ, గోవుల నిర్వహణ ఆనందంతో కూడిన ఆరోగ్యకర ఆదాయం వనరు అని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. గోమాత ను తన ఇంటిపేరుగా చేసుకుని శేరిలింగంపల్లి లో “నిత్య ఆరోగ్య యోగ సన్నిధి” పేరిట గో ఆధారిత ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్వహిస్తున్న గోమాత సురేష్ పై నమస్తే శేరిలింగంపల్లి ప్రత్యేక కథనం…

నిత్య ఆరోగ్య యోగ సన్నిధి లో గోవు లక్ష్మి, ఎద్దు నారాయణ

సాఫ్ట్ వేర్ నుండి సహజ ఉత్పత్తుల వైపు…

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సురేష్ కు చిన్ననాటి నుండే ఆవు అంటే అమితమైన ఆసక్తి. ఈ క్రమంలోనే గో ఆధారిత ఉత్పత్తులకు ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి పంచగవ్య లో ఆరు సంవత్సరాల ఎండి కోర్సు పూర్తి చేయడంతో పాటు కేరళలో మర్మ మసాజ్ లో శిక్షణ పొందాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా గో ఆధారిత ఉత్పత్తులపై అధ్యయనం చేసిన సురేష్ సంవత్సరం క్రితం శేరిలింగంపల్లి వెంకటరెడ్డి కాలనీలో “నిత్య ఆరోగ్య యోగ సన్నిధి” పేరిట గో ఆధారిత ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాడు. ఈ కేంద్రంలో లక్ష్మి అనే ఆవు, నారాయణ అనే ఎద్దులను పోషిస్తూ వాటి ద్వారా పలు రకాల ఉత్పత్తులు, ఔషదాలు తయారు చేయడంతొ పాటు ఔత్సాహికులకు శిక్షణ సైతం అందిస్తున్నాడు. ఈమధ్య రకరకాల మసాజ్ సెంటర్ లు తెరపైకి వచ్చాయి. ఐతే మర్మ మెళకువలు తెలిసిన సురేష్ సాంప్రదాయ మర్ధనతో తనవద్ధకు వచ్చే వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాడు. వీటితో పాటు నేచురోపతి థెరపీ, యోగ థెరపీ వంటి సేవలతో స్థానికంగా మంచి ఆదరణ పొందుతున్నాడు.

గోమయం తో ప్రమిదలు తయారు చేస్తున్న దృశ్యం

పిడకలు మొదలు ప్రమిదల వరకు…

ఈ కేంద్రంలో గో ఆధారిత ఉత్పత్తులలో ముఖ్యంగా ఆవు నెయ్యి, పేడతో ప్రమిదలు, పిడకలు, రేడియషన్ ను తగ్గించే పూసల దండలు, గవ్య కాల్షియమ్, గవ్య జింక్, ఆయింట్మెంట్లు, పలు రకాల వ్యాధుల నివారణకు ఔషదాలతో పాటు రసాయన రహిత, కల్తీ లేని వంట నూనెలు, నొప్పిని నివారించే బామ్, తైలాలు, పేస్ ప్యాక్ , పళ్ళపొడి, ఫ్లోర్ క్లీనర్లు, మిల్లెట్లు, అడవి తేనె, సున్నిపండిలతో పాటు పలు ఆయుర్వేద ఉత్పత్తులను సైతం అందుబాటులో ఉంచారు. గో ఆధారిత ఉత్పత్తుల అమ్మకాలతో పాటు వీటి తయారీలో ఔత్సాహికులకు శిక్షణ సైతం అందిస్తున్నట్లు సురేష్ తెలిపారు. ఉత్పత్తులు అవసరమైన వారు తమ కేంద్రంలో సంప్రదించాలని ఇతర వివరాలకోసం 6309627272 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

గోవు లక్ష్మితో గోమాత సురేష్

గోసంరక్షణతో అపరిమిత ఆదాయం: గోమాత సురేష్

దేశంలో గోవుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. గోవుల నిర్వహణపై అవగాహన లేక చాలామంది ఆవులను ఇమ్ముకుంటున్నారు. ఆవు అంటే ఆర్థిక భారంగా కాకుండా ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సామాన్య ప్రజలు సైతం తమ పనులు చేసుకుంటూనే ఒక గోవును పోషిస్తూ ఉత్పత్తుల తయారీ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఈ నెల 27 వ తేదీ నుండి 29 వరకు నగరంలో గో ఆధారిత ఉత్పత్తుల తయారీ పై మూడు రోజుల పాటు నామమాత్రపు ప్రవేశ రుసుముతో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నాము. ఆసక్తి గల వారు వారి వివరాలు అందించి శిక్షణలో పాల్గొనవచ్చు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here