ప్ర‌మాదం బారిన ప‌డ్డ వ్య‌క్తికి దొడ్ల రామ‌కృష్ణ గౌడ్ ఆర్థిక స‌హాయం

ఆల్విన్ కాల‌నీ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌మాదం బారిన ప‌డి గాయాల‌కు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న వ్య‌క్తికి తెరాస నాయకుడు దొడ్ల రామ‌కృష్ణ గౌడ్ ఆర్థిక స‌హాయం అందజేశారు. వివ‌రాల్లోకి వెళితే… ఆల్విన్ కాల‌నీ డివిజ‌న్ ప‌రిధిలోని ఎల్ల‌మ్మ బండ ద‌త్తాత్రేయ కాల‌నీలో నివాసం ఉండే సురేష్ అనే వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తూ ఇంటి మీద నుంచి కింద ప‌డ్డాడు. దీంతో అత‌నికి గాయ‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌ను రెమెడీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నాడు.

బాధిత వ్య‌క్తి కుటుంబానికి రూ.10వేలు అంద‌జేస్తున్న దొడ్ల రామ‌కృష్ణ గౌడ్

కాగా విష‌యం తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బాధిత వ్య‌క్తికి స‌హాయం చేయాల‌ని ఆదేశించారు. దీంతో టీఆర్ఎస్ యువ‌జన నాయ‌కుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత వ్య‌క్తికి రూ.10వేల ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్న వ్య‌క్తి కుటుంబానికి ఆ మొత్తాన్ని అంద‌జేశారు. అలాగే ఎలాంటి స‌హాయం కావాల‌న్నా వెంట‌నే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, టీఆర్ఎస్‌వీ ప్రదీప్ రెడ్డి, విలేకరులు బుల్లెట్ రవి, రవీందర్, చిన్నా, లోకేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here