సామాజిక సేవలో ముందుండేది
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అవసరానుగుణంగా సేవలు అందించడంలో బిజెపి కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు 17వ సెప్టెంబర్ నుండి 21వ సెప్టెంబర్ వరకు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని
శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి కార్యాలయం వద్ద సేవ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేకానంద సేవ సమితితో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల బిజెపి కార్యకర్తలకు హోమియోపతి మందులను మరియు మున్సిపల్ సిబ్బందికి, కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మణిక్ రావు,నాయకులు కోటేశ్వరరావు, రవి గౌడ్, జితేందర్,వర ప్రసాద్,పవన్, సురేష్, లక్ష్మణ్, ఉమాదేవి, చెందు, రత్నకుమార్, లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, పాపయ్య, సుభద్ర, కల్పన,రఘు, సందీప్, అనిల్, రాజు,యాదగిరి, నర్సింహా,లక్ష్మారెడ్డి, నందు, రవి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.