ప‌ట్ట‌భ‌ద్రులు ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోండి: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రానున్న ఎమ్మెల్సీ ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఓటు హ‌క్కును న‌మోదు చేసుకోవాల‌ని కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌త రెడ్డి సూచించారు. శుక్ర‌వారం చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని విద్యా నగర్ కాలనీలో గ్రాడ్యుయేట్ల‌తో ఓటరు నమోదు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు హ‌క్కు కార్య‌క్ర‌మంలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌తా రెడ్డి

ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ లో ఉన్న 2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు హ‌క్కు కోసం న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. రానున్న రంగారెడ్డి, మహబూబ్ నగర్,హైద్రాబాద్ ఉమ్మ‌డి జిల్లాల‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల‌లో ప‌ట్ట‌భ‌ద్రులు ఓట్లు వేయాల‌ని అన్నారు. ఓటు హ‌క్కును ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చ‌న్నారు. లేదా అప్లికేష‌న్ ఫాంను నింపి త‌మ‌కు అంద‌జేస్తే తాము ఆన్‌లైన్‌లో అప్లై చేయిస్తామ‌ని తెలిపారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఓటు హ‌క్కు పొందేందుకు డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, ఓట‌ర్ ఐడీ కార్డు జిరాక్స్ కాపీలు, 2 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు కావాల‌ని, మొబైల్ నంబ‌ర్ చెప్పాల‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here