శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా భాగ్యలక్షి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను వేయాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని, వీధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వాటర్ ట్యాంకర్లతో కాలనీ లో ఏర్పడిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భాగ్య నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD పనులను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి DGM శరత్ రెడ్డి, నాయకులు మరబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, భాగ్య లక్ష్మీ నగర్ కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.