బీజేపీ బ‌లోపేతానికి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, జూన్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పార్టీ పదవులలో నియమితులైన ప్రతి ఒక్కరు అందరినీ కలుపుకుపోతూ, డివిజన్ లోని ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ బలోపేతానికి తోడ్పడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ సూచించారు. కొండాపూర్ మ‌సీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ ప్రభారి కేశవరావు , గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర రావు, డివిజన్ అధ్యక్షుడు శివాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ నూతన కార్యవర్గం ప్రకటనా కార్యక్రమంలో ర‌వికుమార్ యాద‌వ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని నియమితులైన వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలు సంక్షేమం గురించి బూత్ స్థాయి నుండి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే జిహెచ్ఎంసి , అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఇలా ఏ ఎన్నిక జరిగినా గెలుపే లక్ష్యంగా పనిచేసి డివిజన్ లో కాషాయ జెండా ఎగురవేయాలని కోరారు.

డివిజన్ లో పదవులు చేపట్టిన వారిలో ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, హేమ నళిని, కిషన్ గౌలి, నరేందర్ యాదవ్, సంజీవ, సతీష్ గౌడ్, దుర్గారామ్ ,ప్రధాన కార్యదర్శులు సురేంద్ర ముదిరాజ్, బబ్లూ సింగ్, కార్యదర్శులు రంజిత్ పూరి, రీతిక, దినేష్ యాదవ్, కోశాధికారి లలిత సూర్య సత్య సుధా , ఎస్టీ మోర్చ అధ్యక్షుడు దేవరకొండ గోపాల్, మహిళా మోర్చ అధ్యక్షురాలు ఉదయలక్ష్మి , బీజేవైం అధ్యక్షుడిగా సామ్రాట్ గౌడ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వసంత్ యాదవ్, మీన్ లాల్ సింగ్, అనిల్ గౌడ్, నరేందర్ ముదిరాజ్, వరలక్ష్మి ధీరజ్ , నరసింహ రావు, రవీందర్ రెడ్డి , నరేంద్ర గౌడ్, అమర్ యాదవ్ ,శ్యామ్ యాదవ్ , శివా , విశ్వనాథ్, విశాల్ సింగ్, శ్యాంలేట్ నందు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here