శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ కు చెందిన నాయకుడు సుప్రజ ప్రవీణ్ ను మారబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ ప్రవీణ్ అంటే ఒక పేరు కాదు ఒక వ్యవస్థ అని అన్నారు. ఆయన చేసిన మంచి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. అలాంటి వ్యక్తికి స్నేహితుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇలాంటి పుట్టిన రోజులను ఆయన మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కే. ఎన్. రాములు, శ్రీకాంత్ యాదవ్, గడ్డం శ్రీను, సాయి నందన్ ముదిరాజ్, వెంకట్ రెడ్డి, మహేష్, స్వామినాథ, సురేష్, కొండకల శ్రీనివాస్, స్వామి ముదిరాజ్, శివాజీ, కృష్ణ, శ్రీనివాస్, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.