శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కు తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శేరిలింగంపల్లి డోయన్స్ కాలనీలోని ఆయన నివాసంలో హమీద్ పటేల్‌ను కలిసిన వారు ఆయనకు పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను హమీద్ పటేల్ జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, రూప రెడ్డి, మంగమ్మ, శ్యామల, రఫియా బేగం, యాదగిరి, వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గిరి గౌడ్ పాల్గొన్నారు.