శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ హుడా కేఫ్ సెంటర్ వద్ద హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ సమక్షంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి (బలిదాన్ దివస్) సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. హుడా కేఫ్ రోడ్డులో అమ్మ పేరు మీద – ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ మాట్లాడుతూ భారతీయ జన సంఘ్ (పూర్వ బీజేపీ ) పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతదేశం కోసం బలిదానమైన ఏకైక జాతీయ నాయకుడని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వదేశీయులు కాశ్మీర్ వెళ్లాలంటే పర్మిట్ తప్పనిసరి అని విధానం తీసుకువస్తే, నా దేశం వెళ్లడానికి పర్మిట్ ఎందుకని ప్రశ్నిస్తూ ఏక్ దేశమే , దో విధాన్ , దో ప్రధాన్ , దో నిశాన్ , నహీ చలేగా నహీ చలేగా అంటూ ఆర్టికల్ 370 రద్దు చేయాలని పోరాటం చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , మాజీ కౌన్సిలర్ , సీనియర్ నాయకుడు రమణయ్య , బిజెపి జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు ఆళ్ల వరప్రసాద్ , బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ , నాయకులు పాలెం శ్రీనివాస్ , మల్లేష్ రావు , కుమార స్వామి , బాలరాజు , రామచంద్ర యాదవ్ , ఎల్లయ్య , అఖిల్ , హరీష్ పాల్గొన్నారు.