శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని లక్ష్మీ విహార్ ఫేస్ 2 కాలనీ ఔట్ లెట్ సమస్య పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ లక్ష్మి విహార్ ఫేస్ 2 కాలనీ ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని అన్నారు. ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన, కుచించుకోపోవడం వలన కాలనీలో మురుగు సమస్య తీవ్రమైందని, ఔట్ లెట్ ను సరి చేసి డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM నరేందర్, మేనేజర్ అభిషేక్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, నాయకులు మారబోయిన రాజు యాదవ్ , ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , మంత్రి ప్రగడ సత్యనారాయణ, పద్మారావు, సత్యనారాయణ, లక్ష్మీ విహార్ ఫేస్2 కాలనీ ప్రెసిడెంట్ రవీంద్ర ప్రసాద్ దూబే, వైస్ ప్రెసిడెంట్ గురు దత్తు, జాయింట్ సెక్రటరీ రఘువీర్, ట్రెజరర్ నర్సింహ రావు, విద్య సాగర్, రవి తదితరులు పాల్గొన్నారు.