మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ ప్రజలకు మెరుగైన మౌళికవసతుల కల్పనే ద్యేయగా ముందుకు సాగుతున్నామని మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం కాయిదమ్మ కుంట వద్ద నూతనంగా నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌళికవసతుల కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ చిన్న రెడ్డి ,డి.ఈ సురేష్ , ఏ.ఈ ప్రశాంత్ వార్డ్ సభ్యులు వెంకటేష్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.