కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ పోచమ్మ తల్లి గుడి వెనుక వీధిలో నూతనంగా రూ.20.04 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను త్వరితిగతిన అమలుపరిచి, కొండాపూర్ డివిజన్ ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి కృషి చేస్తానని అన్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఆయన వెంట వార్డు మెంబర్ శ్రీనివాస్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ గఫుర్, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, తెరాస నాయకులు తిరుపతి, మహ్మద్ అలీ, షబ్బీర్, కలీం, ఫిరోజ్, వంశీ, డేవిడ్, అండ్రు, కాలనీ వాసులు ఉన్నారు.