జ‌ర్న‌లిస్టు సంతోష్ నాయ‌క్‌కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ క‌మిష‌న్ స‌న్మానం

  • అక్ర‌మ నిర్మాణాల‌పై వార్త రాసినందుకు అభినంద‌న‌
  •  సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యుడు చిల‌క‌మ‌ర్రి న‌ర‌సింహ

ప‌టాన్‌చెరు (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): క‌బ్జా వార్త రాసినందుకు ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డిచే బెదిరింపుల‌ను ఎదుర్కొన్న వార్త విలేక‌రి సంతోష్ నాయ‌క్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యుడు చిల‌క‌మ‌ర్రి న‌ర‌సింహ శుక్ర‌వారం వారి నివాసంలో కలిశారు. సంతోష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప‌టాన్‌చెరు డిఎస్పి కార్యాలయంలో సంతోష్ నాయ‌క్‌ను ఆయ‌న స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహ మాట్లాడుతూ.. క‌బ్జాదారుల‌కు, అక్ర‌మ వ్యాపారుల‌కు, అవినీతి ప‌రుల‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయ‌ల్సిందేనన్నారు. సంతోష్ నాయ‌క్ ధైర్యంగా ఆ ప‌నిచేసినందుకు అభినందిస్తున్నాన‌న్నారు. తోటి విలేక‌రుల‌కు అత‌ను ఆద‌ర్శ‌మ‌ని కొనియాడారు. ప‌టాన్‌చెరులో జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న అక్ర‌మ నిర్మాణాల‌ను చేపట్టడం నిజ‌మేన‌ని, సంతోష్ రాసిన వార్తాకథనానికి స్పందించి అధికారులు వాటిని తొల‌గించడం అందుకు నిదర్శనం అన్నారు.

సంతోష్ నాయ‌క్‌ను స‌న్మానించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యుడు చిల‌క‌మ‌ర్రి న‌ర‌సింహ
జ‌ర్న‌లిస్టు సంతోష్ నాయ‌క్‌ను, అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యుడు చిల‌క‌మ‌ర్రి న‌ర‌సింహ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here