శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బచ్చుకుంటలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు జనంకోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. గతంలో తాము ఇదే నిర్మాణంపై ఫిర్యాదు చేస్తే నిర్మాణం కొనసాగకుండా ఆపారన్నారు. కానీ కోర్టు కేసు పేరిట కాలయాపన చేస్తున్నారన్నారు. కనుక వెంటనే ఆ నిర్మాణాన్ని తొలగించాలని, కుంటను, కుంట చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను పునరుద్ధరించాలని కోరారు.