శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనులను నిలిపేసిన కాంట్రాక్టర్లు

  • నో పేమెంట్.. నో వర్క్.. అంటు జోనల్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన
  • ఐదు నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జడ్సీ రవికిరణ్ కు వినతిపత్రం అందజేత

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కాంట్రాక్టర్లు తమ పనులను నిలిపివేశారు. తాము చేసిన అభివృద్ధి పనులకు గత ఐదు నెలలుగా జిహెచ్ఎంసి నుంచి పేమెంట్ లు రావడం లేదని పేర్కొంటూ శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు బుధ‌వారం నిరసన చేపట్టారు. నో పేమెంట్.. నో వర్క్.. అని ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా అన్ని వ్యాపారాలు స్తంభించిపోయిన తామంతా బేషరతుగా అభివృద్ధి పనులు కొనసాగించామని, అయినా తమ కష్టాన్ని జిహెచ్ఎంసి గుర్తించడం లేదని అన్నారు. నిలిచిపోయిన పేమెంట్లను తిరిగి చెల్లించేంతవరకు పనులను మొదలు పెట్టేది లేదని హెచ్చరించారు. అనంతరం జోనల్ కమిషనర్ రవికిరణ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన జ‌డ్సి బిల్లుల చెల్లింపు ప్రక్రియ తన పరిధిలోది కాదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంట్రాక్టర్లు కట్ల శేఖర్ రెడ్డి, ఓర్సు వెంకటేశ్వర్లు, అహ్మద్, మల్లికార్జున్, మధుసూదన్, ముస్తఫా హుస్సేన్, ఓర్సు బిక్షపతి, సంపత్, శాంతి కుమార్ పాల్గొన్నారు.

జోనల్ కార్యాలయం ఎదుట శేరిలింగంపల్లి కాంట్రాక్టర్ల నిరసన ప్రదర్శన
జడ్సీ రవికిరణ్ కు వినతి పత్రం అందజేస్తున్న శేరిలింగంపల్లి కాంట్రాక్టర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here