- సత్కరించిన గ్రేటర్ వెస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): బిల్డర్స్ కు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా గ్రేటర్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన మంజుల రఘునాథ్ రెడ్డిని గ్రేటర్ వెస్ట్ బిల్డర్స్ చైర్మన్ మిరియాల రాఘవరావు ఆధ్వర్యంలో వెస్ట్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా టిఎస్ బిపాస్, ధరణి పోర్టల్ ను తీసుకురావడం జరిగిందన్నారు. టిఎస్ బిపాస్ ద్వారా బిల్డర్స్ కు అన్ని అనుమతులు ఒకే చోట లభించనున్నాయని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో బిల్డర్స్ పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. రోజురోజుకీ హైదరాబాద్ లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా అన్ని వర్గాల ప్రజలకు ఇండ్ల ధరలు అనుకూలంగా ఉండే విధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆమె వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజా రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వప్న శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రమణారెడ్డి, ఈసి సభ్యులు విశ్వనాథం, నర్సింగ రావు, శశిధర్ రెడ్డి, హెచ్ ప్రసాద్, ఆల్బిన్, సుమ, రామకృష్ణ పాల్గొన్నారు.